MeeSeva: తెలంగాణలో మీ సేవ కేంద్రాల్లో ఛార్జీల పెంపు.. నేటి నుంచి అమలు

Telangana MeeSeva Center Service Charges Increased
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్రంలో మీసేవ కేంద్రాల్లో అన్ని సేవల ధరలను పెంచారు. ఆయా సర్వీసులపై ధరలను 50 శాతం మేర పెంచారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. ఆదాయ, కుల, స్థానికత వంటి సర్టిఫికెట్ల జారీకి రుసుంను రూ.80కి పెంచారు. జనన ధృవీకరణ పత్రం రుసుం రూ.62 చేశారు. కేటగిరీ 'ఏ' మరియు కేటగిరీ 'బి' కింద వచ్చే దాదాపు అన్ని సేవలపై కూడా ధరలను పెంచింది.

ఇప్పటి వరకు 'ఏ' కేటగిరీ కింద కనీస ఛార్జీ రూ.35 ఉండగా, దానిని రూ.35కు పెంచారు. ఇందులో అడంగల్, పహాణీ వంటి తక్షణ సేవలు ఉంటాయి. కేటగిరీ 'బీ' సర్వీసుల ఛార్జీని రూ.80కి పెంచారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రాసెస్ అయ్యే కుల, ఆదాయ ధృవీకరణ వంటి సేవల ధరలు రూ.80కి పెరిగాయి. ఇవి నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.

మీ సేవ కేంద్రాల నిర్వహణ ఖర్చు పెరిగినందువల్ల ధరలను పెంచాలని నిర్వాహకులు కోరారు. ఈ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ధరల సవరణ చేపట్టింది. విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో విద్యార్థులకు అవసరమైన కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల ధరల పెంపు చోటుచేసుకుంది.
Go Back to Shorts
MeeSeva
Telangana MeeSeva
MeeSeva charges
Telangana government
Income certificate
Caste certificate

More Telugu News