Nitin Nabin: ఏడాదికి ఉచితంగా రెండు ఎల్పీజీ సిలిండర్లు: కేరళలో బీజేపీ హామీ

Nitin Nabin Announces Free LPG Cylinders in Kerala BJP Manifesto
షార్ట్స్‌లో చూడండి
కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. కేరళ ఎన్నికల్లో బీజేపీ పలు ఉచిత పథకాలను ప్రకటించింది. పేద కుటుంబానికి సంవత్సరానికి రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు ఇస్తామని ప్రకటించింది. ఇందులో ఒకటి ఓనం పండుగ సమయంలో ఒకటి, రెండోది క్రిస్మస్ పండుగ సమయంలో ఇస్తామని హామీ ఇచ్చింది.

ప్రతి ఇంటికి నెలకు 20,000 లీటర్ల నీరు ఉచితంగా అందిస్తామని తెలిపింది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల మహిళలకు 'భక్ష్య ఆరోగ్య సురక్ష కార్డు' ద్వారా నెలకు రూ.2,500 ఇస్తామని తెలిపింది. వితంతువులు, పేద కుటుంబాల మహిళలకు, 70 సంవత్సరాలు పైబడిన పౌరులకు నెలకు రూ.3,000 పెన్షన్ ఇస్తామని తెలిపింది. తిరువనంతపురంలో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.
Go Back to Shorts
Nitin Nabin
Kerala BJP
BJP Manifesto
Kerala Assembly Elections
Free LPG Cylinders
Free Water

More Telugu News