Goa Paragliding Accident: గోవాలో పారాసైలింగ్... కేబుల్ తెగి సముద్రంలో పడిపోయిన వ్యక్తి
గోవాలో ఒకరి పారాసైలింగ్ రైడ్ భయాందోళనకు కారణమైంది. ఒక వ్యక్తి పారాసైలింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కేబుల్ తెగిపోయింది. ఆ పర్యాటకుడు కొన్ని మీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో కేబుల్ తెగిపోవడంతో సముద్రంలో పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తూ త్వరితగతిన స్పందించిన సహాయక బృందం ఆ పర్యాటకుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది.
పారాసైలింగ్ రైడ్ చేసిన వ్యక్తి లైఫ్ జాకెట్ కూడా ధరించి ఉన్నాడు. కేబుల్ తెగిపోగానే పడవలో ఉన్న మహిళ భయంతో కేకలు వేస్తూ, సహాయం చేయమని సిబ్బందిని కోరింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
పారాసైలింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కోసం చాలామంది గోవా వెళుతుంటారు. ఇప్పుడు ఈ ప్రమాదకర సంఘటన అందరిలో ఆందోళన కలిగిస్తోంది. ఈ సంఘటన నేపథ్యంలో గోవా పోలీసులు రంగంలోకి దిగారు. పారాసైలింగ్ రైడ్ కోసం నిర్వాహకులు సరైన భద్రతా నియమాలు పాటిస్తున్నారా, అన్ని పరికరాలు బాగా ఉన్నాయా అనే కోణాల్లో తనిఖీ చేస్తున్నారు.