Ishan Kishan: ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్, చివర్లో చెలరేగిన అనికేత్... సన్‌రైజర్స్ భారీ స్కోరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఆకట్టుకునే బ్యాటింగ్ ప్రదర్శన చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (80) అద్భుతమైన ఇన్నింగ్స్‌కు, చివర్లో యువ కెరటం అనికేత్ వర్మ (43) విధ్వంసం తోడవడంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో ఆర్సీబీ ముందు 202 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (11), అభిషేక్ శర్మ (7) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. నితీశ్ కుమార్ రెడ్డి (1) కూడా విఫలమవడంతో సన్‌రైజర్స్ 4.2 ఓవర్లలో కేవలం 29 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ 3 వికెట్లు జాకబ్ డఫీ ఖాతాలోకి చేరాయి. ఈ దశలోకెప్టెన్ ఇషాన్ కిషన్ జట్టు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు.
ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఇషాన్, మైదానం నలువైపులా బౌండరీలు బాదాడు. కేవలం 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 80 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి హెన్రిచ్ క్లాసెన్ (31) నుంచి మంచి సహకారం లభించింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 97 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపారు. ఇషాన్ ఔటైన తర్వాత స్కోరు బోర్డు నెమ్మదిస్తుందని భావించిన తరుణంలో, యువ బ్యాటర్ అనికేత్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసి స్కోరును 200 పరుగులు దాటించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అతని మెరుపు ఇన్నింగ్స్ వల్లే హైదరాబాద్ ఈ భారీ స్కోరును అందుకోగలిగింది.
ఆర్సీబీ బౌలర్లలో జాకబ్ డఫీ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. రొమారియో షెపర్డ్ మూడు వికెట్లు తీసినప్పటికీ 54 పరుగులు సమర్పించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్, సుయాశ్ శర్మ, అభినందన్ సింగ్‌లకు తలో వికెట్ దక్కింది. సొంత మైదానంలో ఆర్సీబీ ఈ భారీ లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తుందో చూడాలి.
కాగా, ఈ మ్యాచ్ కు టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేశ్ కూడా హాజరయ్యారు. ఆయన క్రికెట్ ప్రేమికుడన్న సంగతి తెలిసిందే. ఇవాళ సన్ రైజర్స్ జెండా ఊపుతూ చిన్నస్వామి స్టేడియంలో ఉల్లాసంగా కనిపించారు.