విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పై నాగబాబు ప్రశంసలు

Naga Babu Praises Nara Lokesh on Education Initiatives
  • ఎన్టీఆర్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఆహార నాణ్యతా లోపం
  • విద్యాశాఖ మంత్రిగా క్షమాపణ చెప్పిన నారా లోకేశ్
  • లోకేశ్ లో నాయకుడు కనిపిస్తున్నాడన్న నాగబాబు
  • పాఠశాల స్థాయిలో జరిగిన తప్పుకు బాధ్యత స్వీకరించడం అభినందనీయమని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌పై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రశంసలు కురిపించారు. టీడీపీ నుంచి బాధ్యతగల నాయకుడు ఎదుగుతున్నారని, ఇందుకు లోకేశ్ తీరే నిదర్శనమని ఆయన అన్నారు. మైలవరంలోని పాఠశాలలో జరిగిన పొరపాటుకు మంత్రిగా లోకేశ్ క్షమాపణ చెప్పడం ఆయన బాధ్యతకు, నాయకత్వ లక్షణానికి నిదర్శనమని నాగబాబు పేర్కొన్నారు.

మైలవరంలోని తారకరామ నగర్ మండల పరిషత్ మోడల్ స్కూల్‌లో దొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపం తలెత్తిందని నాగబాబు వెల్లడించారు. ఇది పాఠశాల స్థాయిలో జరిగిన తప్పిదమైనప్పటికీ, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యత స్వీకరించారని వివరించారు. ఈ ఘటనపై లోకేశ్ స్పందించిన తీరును అభినందిస్తున్నానని తెలిపారు.

అంతకుముందు, ఆహార నాణ్యతా లోపంపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ, ప్రభుత్వ పాఠశాలలో ఆహార నాణ్యత సరిగా లేదని తన దృష్టికి రాగానే వెంటనే చర్యలు ప్రారంభించామని తెలిపారు. "వెంటనే ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశాం. వారి నివేదిక ఆధారంగా ఫుడ్ ఏజెన్సీని మార్చడంతో పాటు, హెడ్‌మాస్టర్‌ను సస్పెండ్ చేశాం. పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తాం. తల్లిదండ్రుల నుంచి తక్షణ ఫీడ్‌బ్యాక్ కోసం 'లీప్' యాప్‌ను వినియోగిస్తాం" అని వివరించారు.

"పిల్లలకు, వారి తల్లిదండ్రులకు నా హృదయపూర్వక క్షమాపణలు. ప్రభుత్వ పాఠశాలల్లోని మన విద్యార్థులకు నాణ్యమైన సంరక్షణ అందేలా చూస్తాం. అందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటాం" అని హామీ ఇచ్చారు.
Go Back to Shorts
Nara Lokesh
Naga Babu
Andhra Pradesh Education
AP Education Minister
Midday Meal Scheme
Tarakarama Nagar
Mylavaram
Janasena MLC
Food Quality
LEAP App

More Telugu News