Ustaad Bhagat Singh: ఏపీలో మొదలైన 'ఉస్తాద్ భగత్ సింగ్' అడ్వాన్స్ బుకింగ్స్

Pawan Kalyans Ustaad Bhagat Singh Advance Bookings Open in AP
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ డ్రామా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ నెల 19న వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఒక కీలకమైన అప్‌డేట్ వచ్చింది. ఏపీలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దీంతో థియేటర్ల వద్ద సందడి మొదలైంది.

బ్లాక్‌బస్టర్ హిట్ 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఇప్పుడు సినిమా సందడి మొదలైంది. ఏపీలోని పలు సినిమా హాళ్లు నెమ్మదిగా అడ్వాన్స్ బుకింగ్స్‌ను తెరుస్తున్నాయి. ఇందులో బెనిఫిట్ షోలకు సంబంధించిన టికెట్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. త్వరలోనే అన్ని థియేటర్లలోనూ బుకింగ్స్ పూర్తిస్థాయిలో మొదలుకానున్నాయి.

అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచుతూ ఈ రోజు సాయంత్రం 6.30 గంట‌ల‌కు సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'సంతోషం' చిత్ర దర్శకుడు దశరథ్ స్క్రీన్‌ప్లే అందించాడు. దేవి శ్రీ ప్రసాద్ పాటలు స్వరపరచగా, తమన్ నేపథ్య సంగీతం అందించడం విశేషం.
Ustaad Bhagat Singh
Pawan Kalyan
Harish Shankar
Sreeleela
Raashi Khanna
Mythri Movie Makers
Telugu movies
AP advance bookings
Devi Sri Prasad
S Thaman

More Telugu News