KTR: నా పొట్టను దాచుకోలేక విసిగిపోయా.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

KTR Interesting Post on Hiding His Stomach
  • ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ నేత కేటీఆర్
  • పొట్టను దాచుకోవడం కష్టంగా ఉందని సరదా వ్యాఖ్య
  • ఆరు నెలల తర్వాత మళ్లీ జిమ్ మొదలుపెట్టినట్లు వెల్లడి
  • జులైలో 50వ పుట్టినరోజు నాటికి ఫిట్‌గా ఉండటమే లక్ష్యమ‌న్న మాజీ మంత్రి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన ఫిట్‌నెస్‌పై చేసిన ఓ సరదా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జిమ్‌లో అడుగుపెట్టినట్లు ఆయన వెల్లడించారు. పొట్టను దాచుకోవడం కష్టంగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చమత్కరించారు.

ఈ మేరకు కేటీఆర్ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. "పొట్టను దాచుకోలేక విసిగిపోయాను. ఆరు నెలల గ్యాప్ తర్వాత మళ్లీ జిమ్ చేయడం మొదలుపెట్టాను. వచ్చే జులైలో నాకు 50 ఏళ్లు వస్తాయి. అప్పటికి మంచి ఫిట్‌నెస్‌తో ఉండాలని ఆశిస్తున్నా" అని తన పోస్టులో పేర్కొన్నారు. దీనికి జిమ్‌లో ఫొటోను జ‌త చేశారు. రాజకీయాలకు దూరంగా కేటీఆర్ పెట్టిన ఈ వ్యక్తిగత పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ ట్వీట్‌పై నెటిజన్లు త‌మ‌దైన‌ శైలిలో సరదాగా స్పందిస్తున్నారు.
KTR
K Taraka Rama Rao
BRS
Fitness
Gym
Weight Loss
Telangana Politics
KTR Fitness Challenge
KTR Workout
KTR Health

More Telugu News