యూపీఐ ద్వారా పెన్షన్ ఖాతా.. తత్కాల్ ఎన్పీఎస్ వచ్చేసింది!
- భీమ్ యాప్లో తత్కాల్ ఎన్పీఎస్ ప్రారంభం
- మూడు దశల్లో పెన్షన్ ఖాతా ఏర్పాటు
- బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సదుపాయం
- కనీస తొలి పెట్టుబడి రూ.250, 18-85 ఏళ్ల అర్హులకు అవకాశం
- ప్రస్తుతం ఆరు బ్యాంకుల ఖాతాదారులకు సదుపాయం
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ఖాతా తెరవాలనుకునే వారికి గుడ్న్యూస్. ఇకపై ‘భీమ్’ పేమెంట్స్ యాప్ ద్వారా కేవలం మూడు దశల్లోనే పెన్షన్ ఖాతా ప్రారంభించవచ్చు. ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎన్పీసీఐ) అనుబంధ సంస్థ ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ‘పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ’ (పీఎఫ్ఆర్డీఏ) ప్రవేశపెట్టిన ‘తత్కాల్ ఎన్పీఎస్’ సదుపాయం ద్వారా బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఖాతా తెరవవచ్చు.
ఈ సదుపాయం కోసం కొత్తగా ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బ్యాంకులో ధ్రువీకరించిన కేవైసీ వివరాల ఆధారంగా ఖాతా ప్రారంభించవచ్చు. వినియోగదారులు తమ పుట్టిన తేదీని నమోదు చేసి, అర్హత ఉన్న బ్యాంకు ఖాతాను ఎంచుకుని, యూపీఐ ద్వారా తొలి చెల్లింపు చేయాలి.
ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంది. త్వరలో మరిన్ని బ్యాంకులను ఇందులో చేర్చనున్నారు.
18 నుంచి 85 ఏళ్ల మధ్య వయసున్న అర్హులైన భారతీయ పౌరులు కనీసం రూ.250 తొలి పెట్టుబడితో ఎన్పీఎస్ ఖాతా తెరవవచ్చు. ఆ తర్వాత చేసే చెల్లింపులు రూ.10 నుంచి ప్రారంభించవచ్చు. అయితే ఎన్పీఎస్ నిబంధనలు వర్తిస్తాయి.
ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ పర్యవేక్షణలో పనిచేసే పెన్షన్ పథకం. ఇందులో పెట్టుబడులను నియంత్రణ సంస్థ అనుమతించిన పెన్షన్ ఫండ్ మేనేజర్లు మార్కెట్ ఆధారిత నిధుల్లో పెట్టుబడి పెడతారు. వర్తించే నిబంధనల ప్రకారం పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు.