టీ20 వరల్డ్ కప్ ఫైనల్... ధోనీ, రోహిత్ లకు విశిష్ట గౌరవం
- వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన దిగ్గజాలు ధోని, రోహిత్
- ఈలలు, కేకలతో దద్దరిల్లిన నరేంద్ర మోదీ స్టేడియం
- అలరించిన రిక్కీ మార్టిన్, ఫల్గుణి పాఠక్, సుఖ్బీర్ సింగ్
- జాతీయ గీతాన్ని ఆలపించిన కవితా కృష్ణమూర్తి
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. అభిషేక్, సంజూ శాంసన్ అర్ధసెంచరీలతో విరుచుకుపడగా... చివర్లో శివమ్ దూబే దూకుడు ప్రదర్శించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు జరిగిన ముగింపు వేడుకలు (క్లోజింగ్ సెర్మనీ) ఆద్యంతం అలరించాయి. గ్లోబల్ పాప్ స్టార్ రిక్కీ మార్టిన్ తన హిట్ సాంగ్స్ 'మారియా', 'లా కోపా డి లా విడా'తో స్టేడియాన్ని హోరెత్తించారు. భారతీయ కళాకారులు సుఖ్‌బీర్ సింగ్ తన పంజాబీ పాటలతో, దండియా క్వీన్ ఫల్గుణి పాఠక్ గుజరాతీ జానపద గీతాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అనంతరం ప్రముఖ గాయని కవితా కృష్ణమూర్తి జాతీయ గీతాన్ని ఆలపించారు.