Virat Kohli: కొడుకుతో లండన్ వీధుల్లో విరాట్ కోహ్లీ.. వైరలవుతున్న వీడియో

Virat Kohli Spotted with Son in London Viral Video
  • పిల్లలకు సాధారణ జీవితం ఇచ్చేందుకు లండన్‌లో ఉంటున్న విరాట్, అనుష్క
  • లండన్ వీధుల్లో కొడుకు అకాయ్‌తో కలిసి నడుస్తున్న కోహ్లీ వీడియో వైరల్
  • మీడియాకు, ప్రచారానికి దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని ఎంచుకున్న సెలబ్రిటీ జంట
  • భారీ సెక్యూరిటీ లేకుండా సాధారణ పనులు చేసుకుంటూ కనిపిస్తున్న విరుష్క
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తమ పిల్లలకు సాధారణమైన, ప్రశాంతమైన జీవితాన్ని అందించేందుకు మీడియాకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్న ఈ జంట, తమ వ్యక్తిగత జీవితానికి పూర్తి ప్రాధాన్యం ఇస్తోంది. తాజాగా విరాట్ కోహ్లీ తన కుమారుడు అకాయ్‌తో కలిసి లండన్ వీధుల్లో నడుచుకుంటూ వెళుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో వారి ప్రైవేట్ జీవితానికి అద్దం పడుతోంది.

ఈ వీడియోలో విరాట్ చాలా క్యాజువల్ డ్రెస్‌లో, కొడుకు చేయి పట్టుకుని నడుస్తూ కనిపించాడు. క్రికెట్ మైదానంలో దూకుడుగా కనిపించే కోహ్లీ, ఒక సాధారణ తండ్రిలా తన కొడుకుతో సమయం గడుపుతున్న దృశ్యాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వృత్తిపరమైన బాధ్యతలతో పాటు కుటుంబానికి అతడు ఇస్తున్న ప్రాధాన్యాన్ని చూసి ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

భారత్‌లో ఉండే తీవ్రమైన మీడియా ఒత్తిడి నుంచి తమ పిల్లలు వామిక, అకాయ్‌లను దూరంగా ఉంచుతూ, ఒక సాధారణ బాల్యాన్ని అందించాలనే ఉద్దేశంతోనే విరాట్, అనుష్క ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా 2024 ఫిబ్రవరిలో అకాయ్ పుట్టిన తర్వాత వారు లండన్‌లోని ఖరీదైన నాటింగ్ హిల్ ప్రాంతానికి మకాం మార్చారు. అక్కడ వారు ఎలాంటి భారీ భద్రత లేకుండా స్థానిక కేఫ్‌లకు వెళ్లడం, పార్కుల్లో తిరగడం వంటి పనులు చేస్తూ తరచూ అభిమానులకు కనిపిస్తుంటారు. వారి నిరాడంబర జీవనశైలి అందరినీ ఆకర్షిస్తోంది.

2013లో ఒక వాణిజ్య ప్రకటన చిత్రీకరణలో కలుసుకున్న విరాట్, అనుష్క 2017లో ఇటలీలో వివాహం చేసుకున్నారు. వీరికి 2021లో కుమార్తె వామిక, 2024లో కుమారుడు ఆకాయ్ జన్మించారు. కెరీర్ విషయానికొస్తే, విరాట్ కోహ్లీ 2024 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత టీ20 ఫార్మాట్‌కు, అలాగే 2025 మేలో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే వన్డేల‌తో పాటు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. మరోవైపు అనుష్క శర్మ కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయించేందుకు సినిమాలకు విరామం ఇచ్చారు. 
Virat Kohli
Virat Kohli son
Anushka Sharma
Akaay Kohli
London
Indian Cricket
Bollywood
Royal Challengers Bangalore
Cricket Retirement
Parenting

More Telugu News