Zhou Zhao: 'వ్యూస్' పిచ్చి పతాకస్థాయికి.. భార్య ప్రసవ వేదనను లైవ్ పెట్టిన భర్త!
- భార్య ప్రసవ వేదనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చైనా ఇన్‌ఫ్లుయెన్సర్
- ఆమె ప్రాణాలతో పోరాడుతుంటే.. వీడియో మధ్యలో న్యాపీల యాడ్ చెప్పిన భర్త
- తీవ్ర విమర్శలతో వెల్లువెత్తిన ఆగ్రహం.. షేమ్‌లెస్ అంటూ నెటిజన్ల ఫైర్
- నిబంధనలు ఉల్లంఘించినందుకు డౌయిన్, వీబో ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం
వ్యూస్, డబ్బు కోసం కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ చైనా ఇన్‌ఫ్లుయెన్సర్లు తన భార్య ప్రసవ వేదనను వీడియో తీసి, ఆమె ప్రాణాలతో పోరాడుతున్న సమయంలోనూ యాడ్స్ ప్రమోట్ చేసి తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అతడి ఖాతాలను నిషేధించాయి.
అమెరికాలోని సియాటెల్‌లో నివసించే చైనాకు చెందిన 'పాల్ ఇన్ యూఎస్ఏ' (అసలు పేరు జౌ జావో) ఓ ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్లు. అతడికి డౌయిన్ ప్లాట్‌ఫామ్‌పై 12.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల తన భార్య 23 గంటల పాటు పడిన ప్రసవ వేదనను అతను వీడియో తీసి పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం (3,344 ml) కావడంతో అత్యవసర ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.
అయితే, భార్య ప్రాణాలతో పోరాడుతున్న సమయంలో కూడా పాల్ కెమెరా ఆపలేదు. పైగా, ఆ వీడియో మధ్యలో న్యాపీల కోసం ఓ పెయిడ్ యాడ్ స్క్రిప్ట్‌ను చదివి వినిపించాడు. ఈ వీడియో బయటకు రావడంతో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. భార్య అంతటి బాధలో ఉంటే డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతావా? అంటూ నెటిజన్లు మండిపడ్డారు.
ఈ ఘటనపై తన భార్య ఫిబ్రవరి 10న స్పందిస్తూ.. ప్రసవంలో ఉండే రిస్క్‌లను తెలియజేయడానికే ఈ వీడియో తీశామని వివరణ ఇచ్చింది. అయితే, ప్రజాగ్రహం చల్లారకపోవడంతో నిబంధనల ఉల్లంఘన కింద డౌయిన్, వీబో ప్లాట్‌ఫామ్స్ ఫిబ్రవరి 11న అతడి ఖాతాలను నిషేధించాయి. ఈ వివాదం చైనాలో ఆన్‌లైన్ కంటెంట్ నైతిక విలువలపై పెద్ద చర్చకు దారితీసింది.