Nara Lokesh: బొత్స సత్యనారాయణ పట్టు కోల్పోయారు: నారా లోకేశ్

Nara Lokesh Comments on Botsa Satyanarayana Grip in Council
షార్ట్స్‌లో చూడండి

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంపై చర్చకు వైసీపీ మళ్లీ పట్టుబడుతోంది. నిన్న ఈ విషయమై వైసీపీ తీర్మానం ఇవ్వగా మండలి ఛైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. నేడు కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఇందాపూర్, హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చకు తీర్మానాన్ని ఇవ్వగా మోషేన్ రాజు డిస్మిస్ చేశారు.


దీంతో మండలి విపక్ష నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “టీటీడీలో ఇందాపూర్, హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చించాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో ఈ వ్యవహారంపై చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. అందుకే మండలిలో చర్చకు మేము డిమాండ్ చేస్తున్నాం” అన్నారు.


బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీ లాబీలో నిర్వహించిన చిట్ చాట్‌లో స్పందించారు. “శాసనమండలిలో ఉన్న వైసీపీ సభ్యులపై బొత్స సత్యనారాయణ పట్టు కోల్పోయారు. వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు వేర్వేరుగా వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ఒకరు లడ్డూ కల్తీపై చర్చించాలని, మరొకరు ఇందాపూర్ డెయిరీపై చర్చించాలని అడిగారు. ఈ ఇద్దరు ఎమ్మెల్సీల్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి” అని వ్యాఖ్యానించారు.

Go Back to Shorts
Nara Lokesh
Botsa Satyanarayana
Andhra Pradesh
AP Legislative Council
Tirumala ghee adulteration
Heritage Dairy
Indapur Dairy
YSRCP
TDP
Chandrababu Naidu

More Telugu News