Suryakumar Yadav: నమీబియా బౌలర్లపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు

Suryakumar Yadav Praises Namibia Bowlers
  • అద్భుతంగా బౌలింగ్ చేశారన్న టీమిండియా సారథి
  • పిచ్‌ అనుకున్నంత తేలికగా లేదని వ్యాఖ్య
  • తర్వాత మ్యాచ్‌కు బుమ్రా సిద్ధంగా ఉన్నాడని వెల్లడి
క్రికెట్ పసికూన నమీబియాపై భారత జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో నమీబియా బౌలర్లు చక్కటి బంతులతో ఆకట్టుకున్నారని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసించాడు. కసితో బౌలింగ్‌ చేస్తూ తమ ప్రణాళికలను చక్కగా అమలుపరిచారని అన్నాడు. 

ఇషాన్‌ కిషన్, సంజు శాంసన్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విధానం చూసి అది తేలికగా పరుగులు చేయగలిగే పిచ్‌ అనే అభిప్రాయం కలగడం సహజమేనని అన్నాడు. అయితే, పిచ్‌ అనుకున్నంత తేలికగా లేదని వ్యాఖ్యానించాడు. ఈ పిచ్ పై బ్యాటింగ్ అంత తేలిక కాదని చెప్పాడు. బంతి కాస్త ఆగి బ్యాట్‌ మీదకు వచ్చిందన్నాడు. 

శివమ్‌ దూబె, హార్దిక్‌ పాండ్య మధ్య భాగస్వామ్యం భారత జట్టును పటిష్ఠ స్థితికి తీసుకెళ్లిందని సూర్యకుమార్‌ చెప్పాడు. ఈ మ్యాచ్ లో జస్‌ ప్రీత్‌ బుమ్రా తన కోటా నాలుగు ఓవర్లు పూర్తిచేయడం శుభసూచకమని అన్నాడు. ఈ టోర్నమెంట్ లో తర్వాత మ్యాచ్‌కు బుమ్రా సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌ కాంబినేషన్‌ను ఎదుర్కోవడం తమ ప్రత్యర్థులకు కష్టమేనని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.
Suryakumar Yadav
Namibia
T20 World Cup
Jasprit Bumrah
Axar Patel
Varun Chakravarthy
Ishan Kishan
Sanju Samson
Shivam Dube
Hardik Pandya

More Telugu News