Tumbler Ridge: కెనడాలో కాల్పుల కలకలం.. 9 మంది మృతి.. తనను తాను కాల్చుకున్న నిందితుడు

Tumbler Ridge Shooting in Canada Leaves 10 Dead
షార్ట్స్‌లో చూడండి
కెనడాలో మరోసారి కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బ్రిటిష్ కొలంబియాలోని టంబ్లర్ రిడ్జ్‌లో ఉన్న ఓ సెకండరీ స్కూల్‌లో జరిగిన కాల్పుల్లో నిందితుడి సహా మొత్తం 10 మంది మరణించారు. మరో 27 మంది గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు (RCMP) ధ్రువీకరించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్‌తో పాటు సమీపంలోని ఓ నివాస గృహంలో కూడా ఈ కాల్పులు జరిగాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్కూల్‌ను చుట్టుముట్టారు. లోపల గాలింపు చేపట్టగా, పలువురు మృత్యువాత పడి ఉండటాన్ని గుర్తించారు. నిందితుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ ఘటనలో స్కూల్‌లో ఆరుగురు, ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు, నివాస గృహంలో ఇద్దరు మరణించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, వారిని ఎయిర్‌లిఫ్ట్ చేసి ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. మిగిలిన 25 మందికి స్థానిక వైద్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.

ఈ దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, బీసీ ఆర్‌సీఎంపీ మేజర్ క్రైమ్ యూనిట్ దర్యాప్తు చేపట్టిందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో, ఈ వారం మొత్తం స్థానిక స్కూళ్లకు సెలవు ప్రకటించారు. "ఈ విషాద ఘటన బాధితుల కుటుంబాలకు, ఆప్తులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం" అని ఆర్‌సీఎంపీ అధికారి ఒకరు ప్రకటనలో తెలిపారు.
Go Back to Shorts
Tumbler Ridge
Canada shooting
British Columbia
RCMP
school shooting
mass shooting
Canada crime
Tumbler Ridge Secondary School
crime news

More Telugu News