Jennifer: భారతీయుల గురించి జర్మనీ యువతి ఆసక్తికర వ్యాఖ్యలు

Jennifer German girl comments on Indians kindness
  • భారతీయుల మంచితనాన్ని, స్నేహాన్ని తక్కువగా అంచనా వేయొద్దన్న జర్ననీ యువతి జెన్నిఫర్
  • భారత పర్యటనలో అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్న జన్నీఫర్
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
భారతీయుల మంచితనాన్ని, స్నేహాన్ని తక్కువగా అంచనా వేయొద్దంటూ ఓ జర్మనీ యువతి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భారత్‌లో తనకు ఎదురైన ఓ సమస్య నుంచి ఫ్రెండ్స్ ఎలా ఆదుకున్నారో వివరిస్తూ ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. 

బెర్లిన్‌కు చెందిన జెన్నిఫర్ అనే యువతి ఇటీవల భారత పర్యటనకు వచ్చింది. అయితే ఆమె వెంట తీసుకొచ్చిన ఒక్క క్రెడిట్ కార్డు, పర్సు రెండూ అనుకోకుండా పోవడంతో పూర్తిగా దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. కానీ ఈ సమయంలో భారత్‌లో ఉన్న తన స్నేహితులు అండగా నిలిచి.. ఆమెను ఆ కష్టాల నుంచి బయటపడేశారు. 

జెన్నిఫర్ తన వీడియోలో మాట్లాడుతూ..ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎప్పుడూ ఓ కంట కనిపెట్టుకుని ఉన్నారు. నా పర్యటన పూర్తయ్యే వరకు నాకు కావాల్సిన డబ్బులు అడిగి మరీ ఇచ్చారు. నాకు క్షణం కూడా ఆందోళన అవసరం రాలేదు. ఇలాంటి బ్యాకప్ సిస్టమ్ ఉంటుందని నేను ఊహించలేదు. పర్యటన పూర్తయ్యాక ఎవరి డబ్బులు వారికి తిరిగి ఇచ్చేశాను. భారతీయుల స్నేహాన్ని, ఆతిథ్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదు అని పేర్కొంది.  

ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. భారతీయుల ఆతిథ్యం, స్నేహం నిజంగా గొప్పదని కామెంట్లు చేస్తున్నారు. కొందరు తమకూ ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని చెబుతున్నారు. ఈ వీడియో పోస్ట్ చేసిన రెండు రోజుల్లోనే 10 లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం. ఇక ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయండి..!

.
Jennifer
Germany girl
Indian friends
India travel
Credit card lost
Indian hospitality
Viral video
Social media
Berlin
Travel experience

More Telugu News