అర్ధరాత్రి విషాదం.. ఫిలిప్పీన్స్ లో ఘోర అగ్నిప్రమాదం.. వీడియో ఇదిగో!
- కాలి బూడిదైన వెయ్యికి పైగా నివాసాలు
- 5 వేల మందికి పైగా నిరాశ్రయులు
- తీరప్రాంత నగరం బొంగావోలో దారుణం
పెను గాలులకు మంటలు వేగంగా వ్యాపించాయని, చుట్టుపక్కల ఇళ్లకు అంటుకున్నాయని చెప్పారు. ఎగసిపడుతున్న మంటలను చూసి ఇళ్లల్లోని జనం ఒడ్డుకు పరుగులు తీశారు. మరికొందరు సముద్రంలో దూకి ఈదుతూ తీరం చేరారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. అయితే, అప్పటికే ఆ ఏరియా మొత్తం కాలిబూడిదైంది. రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి బాధితులను షెల్టర్ హోంకు తరలించారు.
బాధితులకు అవసరమైన ఏర్పాట్లు చేశామని అధికార యంత్రాంగం తెలిపింది. తాత్కాలిక టెంట్లు, ఆహార పదార్థాలు, నీరు ఏర్పాటు చేసి, గాయపడ్డవారికి చికిత్స అందించినట్లు వెల్లడించింది. కాగా, ఈ భారీ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.