ఏనుగును దత్తత తీసుకున్న తమిళ హీరో

Siva Karthikeyan Adopts Elephant at Vandalur Zoo
  • వండలూర్ జూ పార్క్‌లో ఉన్న ఓ ఏనుగును దత్తత తీసుకున్న శివ కార్తికేయన్
  • ఏనుగు సంరక్షణ బాధ్యతలను శివ కార్తికేయన్ స్వయంగా పర్యవేక్షించనున్నారన్న జూ పార్క్ అధికారులు
  • సోషల్ మీడియాలో అభిమానుల ప్రశంసలు
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. వండలూర్ జూ పార్క్‌లోని ఓ ఏనుగును ఆయన దత్తత తీసుకున్నారు. ప్రకృతి అనే పేరు గల ఆ ఏనుగు సంరక్షణ బాధ్యతలను ఆరు నెలల పాటు శివ కార్తికేయన్ స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఈ విషయాన్ని జూ పార్క్ అధికారులు అధికారికంగా ప్రకటించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హీరో చేసిన ఈ మంచి పనికి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక శివ కార్తికేయన్ సినిమాల విషయానికి వస్తే, ఆయన నటించిన 'పరాశక్తి' చిత్రం పొంగల్ కానుకగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 10న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమాను రాజకీయాలతో ముడిపెట్టడంతో కొంత వివాదానికి దారితీసింది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. 
Go Back to Shorts
Siva Karthikeyan
Tamil actor
Vandalur Zoo
Elephant adoption
Prakti elephant
Siva Karthikeyan Parasakthi movie
Pongal movie release
Srileela
Sudha Kongara

More Telugu News