Prabhas: కేటీఆర్‌తో ప్రభాస్ పెద్దమ్మ కీలక వ్యాఖ్యలు!.. నెట్టింట వైరల్

Prabhas Aunt Shyamaladevi Comments to KTR Viral
  • వివాహ వేడుకలో తారసపడ్డ కేటీఆర్, శ్యామలదేవి
  • "నెక్స్ట్ అధికారం మనదే" అన్న శ్యామలదేవి
  • ధన్యవాదాలు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
"నెక్స్ట్ అధికారం మనదే" అని ప్రముఖ నటుడు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలదేవి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వీరిద్దరు ఒక వివాహ వేడుకలో కలుసుకున్నారు. ఆ సమయంలో శ్యామలదేవి ఈ వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన శ్యామలదేవి బయటకు వస్తుండగా, కేటీఆర్ అక్కడికి చేరుకోవడంతో ఇరువురూ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. శ్యామలదేవి "నెక్స్ట్ అధికారం మనదే" అని అనగా, కేటీఆర్ నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలిపారు. గట్టిగా వినబడనప్పటికీ, వీడియోలో మూడో సెకనులో ఆమె ఈ వ్యాఖ్యలు స్పష్టంగా వినబడుతున్నాయి.

కేటీఆర్ ఆమెను... లోనికి వస్తున్నారా (వివాహ వేడుకకు) లేక వెళుతున్నారా? అని అడగగా, తాను వెళ్లి వచ్చానని శ్యామలదేవి సమాధానమిచ్చారు. అనంతరం, అమ్మానాన్నతో సహా అందరినీ అడిగినట్లు చెప్పండని కేటీఆర్‌తో ఆమె అన్నారు. తర్వాత ఇరువురు కలిసి మీడియా ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చారు.
Prabhas
KTR
BRS
Shyamaladevi
Telangana Politics
Telangana Elections
Political News
Viral Video

More Telugu News