Manchu Manoj: నటుడు రామచంద్రను పరామర్శించిన మంచు మనోజ్
- పక్షవాతంతో బాధపడుతున్న రామచంద్రను పరామర్శించిన మంచు మనోజ్
- హైదరాబాద్‌లోని రామచంద్ర నివాసానికి వెళ్లిన మనోజ్
- రామచంద్ర ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వైనం
‘వెంకీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు రామచంద్ర ఆరోగ్య పరిస్థితిని చూసి సినీ హీరో మంచు మనోజ్ చలించిపోయారు. కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్న ఆయన్ను హైదరాబాద్‌లోని నివాసంలో పరామర్శించారు.
వివరాల్లోకి వెళితే, నటుడు రామచంద్ర గత కొన్నేళ్లుగా పక్షవాతం సమస్యతో పోరాడుతూ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన అనారోగ్యం గురించి తన సోదరుడి ద్వారా తెలుసుకున్న మంచు మనోజ్ ఈరోజు నేరుగా హైదరాబాద్‌లోని రామచంద్ర ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా రామచంద్రను ఆప్యాయంగా పలకరించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు.
ఈ పరామర్శకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామచంద్ర త్వరగా కోలుకుని, మళ్లీ మునుపటిలా సినిమాల్లో నటించాలని మనోజ్ ఆకాంక్షించారు. తోటి కళాకారుడు కష్టాల్లో ఉన్నప్పుడు మనోజ్ స్పందించిన తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.