పవనన్నకు శుభాభినందనలు.. కుంకీ ఏనుగుల రాకపై లోకేశ్ ట్వీట్
- కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి
- చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్
- యువగళం పాదయాత్రలో ఈ సమస్యను రైతులు తన దృష్టికి తెచ్చారని వెల్లడి
యువగళం పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు ఈ సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని మంత్రి నారా లోకేశ్ గుర్తుచేసుకున్నారు. ఏనుగుల విధ్వంసంతో పంటలు నష్టపోతున్నామని రైతు సోదరులు తమ ఆవేదన వ్యక్తం చేశారని ఆయన అన్నారు. రైతుల కష్టాలకు చెక్ పెట్టేందుకు పవనన్న ప్రత్యేకంగా చొరవచూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారని తెలిపారు. కాగా, ఏపీలో ఏనుగుల గుంపులను తరిమికొట్టేందుకు కుంకీ ఏనుగులను ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరగా కర్ణాటక ప్రభుత్వం నాలుగు కుంకీ ఏనుగులను అప్పగించిన విషయం విదితమే.