Pakistan Cricket Board: రావల్పిండి క్రికెట్ స్టేడియం వద్ద డ్రోన్ క్రాష్... పీఎస్ఎల్ మ్యాచ్ డౌటే!

Indias Drone Attack on Rawalpindi Cricket Stadium
  • భారత్ లోని పలు నగరాలపై దాడికి యత్నించిన పాక్
  • ప్రతీకార దాడులు చేస్తున్న భారత్
  • పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్ ఉండే రావల్పిండిపై డ్రోన్లతో దాడి?
భారత్ లోని పలు నగరాలపై దాడులకు యత్నించిన పాక్ ప్రయత్నాలను భారత బలగాలు తిప్పికొట్టాయి. పాక్ మిస్సైల్ ను గాల్లోనే పేల్చివేశాయి. దీనికి సమాధానంగా భారత్... పాక్ పై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. లాహోర్ లోని కీలక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసింది. పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్ ఉండే రావల్పిండిపై కూడా డ్రోన్ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. 

కాగా, రావల్పిండి క్రికెట్ స్టేడియం వద్ద ఓ డ్రోన్ కూలిపోయినట్టు తెలిసింది. దాంతో, అక్కడి రెస్టారెంట్ తో పాటు, స్టేడియం కొంత మేర దెబ్బతిన్నట్టు సమాచారం. ఈ దాడిలో ఇద్దరు గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు.

రావల్పిండిలో ఈ రాత్రి పీఎస్ఎల్ క్రికెట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ నిర్వహణపై అనుమాన మేఘాలు అలముకున్నాయి. భారత్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో పీఎస్ఎల్ లోని మిగతా మ్యాచ్ లను పాక్ క్రికెట్ బోర్డు దుబాయ్ కి మార్చాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 
Pakistan Cricket Board
Drone Attack
Rawalpindi Cricket Stadium
Pakistan Cricket League
India-Pakistan Tension
Rawalpindi
Drone Warfare
International Cricket
Foreign Players

More Telugu News