స్టార్స్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అలా ఇక్కడి వారి అభిమానాన్ని సొంతం చేసుకున్న అక్కడి హీరోలలో టోవినో థామస్ ఒకరుగా కనిపిస్తాడు. ఆయన తాజా చిత్రమైన 'పళ్లి చట్టంబి', ఏప్రిల్ 15వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ రోజు (జులై 24)వ తేదీ నుంచి ఈ సినిమా 'సోనీలివ్'లో 6 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
కేరళలో 'తరియెట్టమల' పర్వత ప్రాంతం. ఆ కొండలకు చుట్టూ చాలా గిరిజన గూడాలు ఉంటాయి. అయితే ఎవరూ కూడా 'తరియెట్టమల' వైపు వెళ్లరు. అందుకు కారణం అది 'పిశాచి భూమి' అనే ఒక భయం అక్కడి ప్రజలలో ఉండటమే. ఇప్పుడు మనిషనేవాడు లేని ఆ ప్రదేశం గురించి, చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కథలుకథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అటుగా వెళ్లే సాహసం మాత్రం ఎవరూ చేయరు.
ఆ పర్వత ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న మరో గ్రామమే 'కణియార్'. ఆ ప్రాంతంలో కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారు. కమ్యూనిస్టులు తమ భూములను లాగేసుకుంటారనే భయం అక్కడి జనంలో బలపడుతుంది. దాంతో వాళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడుపుతుంటారు. ఇక కమ్యూనిస్టులు స్థానికంగా బలంగా ఉన్నవారిని తమ పార్టీలో కలుపుకుంటూ వెళుతూ ఉంటారు. 'కణియార్'లోని చర్చికి సంబంధించిన ఫాదర్, జరుగుతున్న పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తాడు.
చర్చిని .. దాని తాలూకు భూములను కాపాడటానికి భయమనేది తెలియని ఒక బలవంతుడు కావాలనీ, రౌడీయిజం .. తిరుగుబాటు తెలిసినవాడైతే మరీ మంచిదని భావిస్తారు. అలాంటివాడి కోసం వెతికి, 'తోమాపురం' నుంచి కృష్ణ పిళ్లై ( టోవినో థామస్)ను పట్టుకుంటారు. అతనికి విషయం చెప్పి .. నెలవారీ జీతం ఇస్తామని చెప్పి .. అతని పేరును 'క్రిస్టఫర్ పోతన్'గా మార్చేసి తమ ఊరికి తీసుకొస్తారు. పోతన్ ఆ ఊళ్లో అడుగుపెడుతూనే, లోకల్ రౌడీ అయిన 'జార్జ్'తో గొడవపడి అతనిని ఓడిస్తాడు.
కమ్యూనిస్టు పార్టీని వీధి నాటకాల ద్వారా జనంలోకి తీసుకుని వెళ్లే బృందంలో 'రెబెక్కా' (కయాదు లోహర్) ఒకరుగా ఉంటుంది. ఆ ప్రదర్శనను ఆపడానికి చర్చి తరఫున పోతన్ వెళతాడు. అక్కడే వాళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఒకరి ఆకర్షణలో ఒకరి పడతారు. అందువలన అతను ఆ ప్రదర్శనకు అడ్డుచెప్పలేకపోతాడు. పర్యవసానంగా అతనికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? కమ్యూనిస్టు పార్టీని దోషిగా చూపిస్తూ ఈ గొడవలను సృష్టిస్తున్న సూత్రధారి ఎవరు? కృష్ణ పిళ్లై జీవితాన్ని రెబెక్కా ఎలా ప్రభావితం చేస్తుంది? అనేదే మిగతా కథ.
'పళ్లి చట్టంబి' అంటే 'చర్చి రౌడీ' అనే అర్థం ఉంది. అంటే చర్చి కోసం పనిచేసే రౌడీ అన్నమాట. 1950 - 60 మధ్యకాలంలో నడిచే కథ ఇది. ఒక గ్రామస్తులు తమ చర్చి పరిధిలోని భూములను రక్షించుకోవడం కోసం .. కమ్యూనిస్టులపై పోరాడటం కోసం ఒక రౌడీని నియమించుకుంటారు. అతని రాకతో ఆ ఊళ్లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి? అనేదే ఈ కథలోని ప్రధానమైన అంశం.
కొండల ప్రాంతంలోని ఒక గ్రామం .. ఆ గ్రామంలో జరిగే కమ్యూనిస్టుల ప్రచారం .. వాళ్లని అడ్డుకోవడానికి జరిగే భూ పోరాటం .. చర్చి తరఫున బరిలోకి దిగిన ఒక రౌడీ .. అతనిని ప్రభావితం చేసిన ఒక ప్రియురాలు. ఈ అంశాలను కలుపుకుంటూ ఈ కథ నడుస్తుంది. ఈ కథలో కీలకమైన పాత్రలైన కయాదు లోహార్ .. శత్రు .. పృథ్వీ రాజ్ సుకుమారన్ పాత్రలు సందర్భాను సారంగా తెరపైకి వస్తాయి. అయితే అందుకు కొంత సమయం పడుతుంది.
1950 - 60మధ్య కాలంలో కేరళలోని పరిస్థితులను స్ఫూర్తిగా తీసుకుని ఈ కథను తెరకెక్కించారు. ఆనాటి సంఘటనలపై అవగాహన ఉన్నవారికి ఈ కథ కనెక్ట్ అవుతుంది. మిగతావారిని మనసులను మాత్రం ఎమోషనల్ గా ఆ స్థాయిలో టచ్ చేయలేదు. కయాదు లోహార్ ఎంట్రీ నుంచి ఆమె పాత్ర ఉన్నంతవరకూ గల కంటెంట్ మరింత ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది.
కమ్యూనిస్టులకు .. గ్రామస్తులకు మధ్య గొడవకు కారణాన్ని .. కారకులను రివీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. డబ్బు కోసం చర్చి తరఫున నిలబడిన యువకుడు, తన ప్రేమికురాలి ఆశయం కోసం అక్కడే ఉండిపోవడాలను కోవడం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. మిగతా కథాకథనాలు నిదానంగా సాగినప్పటికీ, 1950 - 60 నేపథ్యానికి సంబంధించిన వాతావరణాన్ని గొప్పగా ఆవిష్కరించగలిగారు.
టోవినో థామస్ నటన మెప్పిస్తుంది. కయాదు లోహర్ మరింత అందంగా కనిపించింది. మిగతా వాళ్లంతా ఎవరి పాత్ర పరిధిలో వాళ్లు బాగానే చేశారు. టిజో టోమీ చితీకరణ చాలా అందంగా కొనసాగుతుంది. జోక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. 'ఇన్నినాళ్లు చూడలేదులే' అనే మెలోడీ సాంగ్ మనసుకు హత్తుకుంటుంది. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ చాలా నీట్ గా అనిపిస్తుంది.
'పళ్లి చట్టంబి' 1950 - 60 మధ్య కాలంలో, కేరళ ప్రాంతంలోని ఒక విలేజ్ నేపథ్యంలో సాగే కథ. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, సహజత్వానికి చాలా దగ్గరగా ప్రేక్షకులను తీసుకుని వెళుతుంది. ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టడంలో ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది.
'పళ్లిచట్టంబి' (సోనీ లివ్) మూవీ రివ్యూ!
Pallichattambi Review
Movie Details
Movie Name: Pallichattambi
Release Date: 2026-07-24
Cast: Tovino Thomas,Kayadu Lohar,Shatru ,Vijayaraghavan,Siddique
Director: Dijo Jose Antony
Music: Jakes Bejoy
Banner: World Wide Films
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer