పేపర్ లీకేజీలపై ఉక్కుపాదం.. 10 ఏళ్ల జైలు, 10 కోట్ల జరిమానా?
- పేపర్ లీకేజీ చట్టాన్ని కఠినతరం చేయనున్న కేంద్రం
- దోషులకు 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా సవరణలు
- నీట్-యూజీ వంటి పరీక్షల లీకేజీల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పరీక్ష పత్రాల లీకేజీల నివారణకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. పబ్లిక్ పరీక్షల (అక్రమ మార్గాల నివారణ) చట్టం-2024కు సవరణలు చేస్తూ, దోషులకు మరింత కఠిన శిక్షలు విధించే ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ శుక్రవారం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ నూతన సవరణల ప్రకారం, ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడే వారికి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు, రూ.10 కోట్ల వరకు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారం వ్యక్తిగత అక్రమాలకు మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తున్నారు. వ్యవస్థీకృత నేరాలకు ఇప్పటికే కఠిన శిక్షలు ఉన్నప్పటికీ, తాజా సవరణలతో వాటిని మరింత పటిష్ఠం చేయనున్నారు.
దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు హాజరైన నీట్-యూజీ 2026 పరీక్ష పత్రం లీక్ కావడంతో, ఆ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించిన సంగతి విదితమే. ఈ పరిణామంతో పాటు పలు ఇతర పోటీ పరీక్షల్లోనూ అక్రమాలు చోటుచేసుకోవడంతో విద్యార్థి లోకం నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.