తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. స్పందించిన కేటీఆర్
- తెలంగాణ రాష్ట్రం దివాలా తీయలేదని కేటీఆర్ స్పష్టీకరణ
- 'చీప్ మినిస్టర్' అంటూ చురక
- మేధోపరంగా, నైతికంగా కాంగ్రెస్ దివాలా తీసిందని ఆరోపణ
తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. "రాష్ట్రం దివాలా తీయలేదు. మిస్టర్ 'చీప్ మినిస్టర్'. నిజానికి మేధోపరంగా దివాలా తీసింది, నైతికంగా దిగజారింది మీరూ, మీ అవినీతి కాంగ్రెస్ పార్టీయే" అంటూ ఘాటుగా విమర్శించారు.