జయకృష్ణ ఘట్టమనేని 'శ్రీనివాస మంగాపురం' వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఫిక్స్
Add ap7am to your home Screen

జయకృష్ణ ఘట్టమనేని 'శ్రీనివాస మంగాపురం' వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఫిక్స్

Jaya Krishna Ghattamaneni Srinivasa Mangapuram to hit screens on July 30
  • శ్రీనివాస మంగాపురం' జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల
  • జయకృష్ణ, రాషా తడానీ హీరోహీరోయిన్లు
  • 'RX 100', 'మంగళవారం' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం
  • సినిమాలో ప్రతినాయకుడిగా సీనియర్ నటుడు మోహన్ బాబు
  • తిరుపతి నేపథ్యంలో సాగే ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా
సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరుడి కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ హీరోయిన్‌గా నటిస్తూ టాలీవుడ్‌కు పరిచయమవుతోంది.

'RX 100', 'మంగళవారం' వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తిరుపతి నేపథ్యంలో సాగే ఓ ఇంటెన్స్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్నేహితులుగా ఉండి ప్రేమికులుగా మారిన వాసుబాబు, మంగల కథ ఇది. వారి ఆనందమయ జీవితంలోకి ఓ ఊహించని సంఘర్షణ ఎదురైనప్పుడు ఏం జరిగిందనేదే కథాంశం. తనదైన శైలిలో యాక్షన్, డ్రామా జోడించి అజయ్ భూపతి ఈ ప్రేమకథను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో సీనియర్ నటుడు మోహన్ బాబు 'వెంకటప్పయ్య నాయుడు' అనే కీలకమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనుండటం విశేషం. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ సమర్పణలో, చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు, టీజర్లు సినిమాపై అంచనాలను పెంచాయి.

ఈ చిత్రానికి రెండుసార్లు జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నాటికే దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం శరవేగంగా పనులు జరుపుకుంటోంది.
Advertisement
Jaya Krishna Ghattamaneni
Srinivasa Mangapuram
Ajay Bhupathi
Rasha Thadani
Mohan Babu
Srinivasa Mangapuram release date

More Telugu News