Priyadarshi: తెలుగు సినీ జర్నలిస్టులకు ఉచితంగా కంటి పరీక్షలు

Free Eye Camp for Telugu Film Journalists

  • TFJA, ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర్ ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో క్యాంప్
  • తెలుగు ఫిలిం చాంబర్‌లో ఫిల్మ్ జర్నలిస్టులకు ఉచిత కంటి పరీక్షలు
  • ముఖ్య అతిథులుగా హాజరైన హీరో ప్రియదర్శి, నిర్మాత నాగ వంశీ

తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA), ఫిల్మ్ జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ దిశగా మరో ముందడుగు వేసింది. ఫీనిక్స్ ఫౌండేషన్ మరియు శంకర్ ఐ హాస్పిటల్ సహకారంతో శనివారం (ఏప్రిల్ 26) హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం చాంబర్ ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ శిబిరం ద్వారా పలువురు ఫిల్మ్ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు కంటి పరీక్షలు చేయించుకున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు ప్రియదర్శి, నిర్మాత నాగవంశీ ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ఐ క్యాంప్‌కు శ్రీకారం చుట్టారు. అనంతరం ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాశ్ చుక్కపల్లి, శంకర్ ఐ హాస్పిటల్ యూనిట్ హెడ్ విశ్వ మోహన్, TFJA అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు రఘు, ప్రధాన కార్యదర్శి వై.జె. రాంబాబు తదితరులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.

ఈ సందర్భంగా హీరో ప్రియదర్శి కూడా శిబిరంలో తన కంటి చూపును పరీక్ష చేయించుకున్నారు. ఆయన కంటి చూపు పనితీరు బాగుందని వైద్యులు నిర్ధారించారు. అనంతరం ప్రియదర్శి మాట్లాడుతూ, "తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆరోగ్య శిబిరంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఫిల్మ్ జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్న TFJA ప్రతినిధులను, ఈ కార్యక్రమానికి సహకరించిన ఫీనిక్స్ ఫౌండేషన్ అవినాశ్ చుక్కపల్లి గారికి, శంకర్ ఐ హాస్పిటల్ విశ్వమోహన్ గారికి నా అభినందనలు" అని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.

శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ ఉచిత కంటి పరీక్షల శిబిరం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. శంకర్ ఐ హాస్పిటల్ వైద్య బృందం... TFJA సభ్యులకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, తగిన సూచనలు అందించింది.

Priyadarshi
Telugu Film Journalists Association
TFJA
Free Eye Checkup Camp
Hyderabad
Phoenix Foundation
Shankar Eye Hospital
Film Journalists Health
Eye Care
Avinash Chukka Palli
Vishwa Mohan
Nagavanshi
  • Loading...

More Telugu News