అమెరికా సెకండ్ లేడీ పూర్వీకుల గ్రామం వడ్లూరు

Ancestral Village of US Second Lady Usha Harris
  • భర్త జేడీ వాన్స్ తో కలిసి భారత పర్యటనకు వచ్చిన ఉష
  • సొంతూరుకు వస్తుందని ఆశిస్తున్న వడ్లూరు గ్రామస్థులు
  • జేడీ వాన్స్ గెలుపు కోసం అప్పట్లో వడ్లూరులో పూజలు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ భారత సంతతికి చెందిన వారనే విషయం తెలిసిందే. ఉష పూర్వీకుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వడ్లూరు గ్రామం.. ఇక్కడి నుంచి ఉష తల్లిదండ్రులు అమెరికా వలస వెళ్లారు. ఉష అమెరికాలోనే జన్మించి, అక్కడే పెరిగారు. కాలేజీలో జేడీ వాన్స్ తో జరిగిన పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో జేడీ వాన్స్ పోటీ చేయగా.. ఆయన గెలుపు కోసం ఉష పూర్వీకుల గ్రామం వడ్లూరులో గ్రామస్థులు పూజలు చేశారు. స్థానిక ఆలయాల్లో హోమం చేశారు. ఎన్నికల్లో గెలిచి జేడీ వాన్స్ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో జేడీ వాన్స్ తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. కుటుంబ సమేతంగా నాలుగు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఉష తమ గ్రామంలో పర్యటిస్తుందని వడ్లూరు గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఉష కుటుంబం గ్రామాభివృద్ధికి ఎంతగానో పాటుపడిందని చెబుతున్నారు. ఉష రాకకోసం గ్రామమంతా ఎదురుచూస్తోందని తెలిపారు.
Go Back to Shorts
Usha Harris
Kamala Harris
Vadluru Village
West Godavari District
Andhra Pradesh
India
US Vice President
Doug Emhoff
Indian Ancestry
America

More Telugu News