ఇది అందరినీ నవ్వించే సినిమా: సంపూర్ణేష్ బాబు
- మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో ‘ సోదరా’ సినిమా
- ఈ నెల 25న విడుదల
- ఈ సినిమా చూస్తే నిజ జీవిత ఘటనలు గుర్తుకు వస్తాయన్న సంపూర్ణేష్ బాబు
- ఈ మూవీ చూశాక అన్నదమ్ముల బంధాలు బలపడతాయన్న మరో నటుడు సంజోష్
ఈ మూవీలో నటిస్తున్న మరో నటుడు సంజోష్ మాట్లాడుతూ.. సంపూర్ణేష్‌తో కలిసి బ్రదర్‌లా నటించడం చాలా సంతోషంగా ఉందన్నాడు. అన్నదమ్ముల మధ్య తలెత్తే మనస్పర్థలను ఈ సినిమా ఎత్తి చూపిస్తుందని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరినీ ఇది టచ్ చేస్తుందన్నారు. ఈ మూవీ చూస్తే అన్నదమ్ముల బంధాలు మరింత బలపడతాయని చెప్పారు. నేటి తరం ప్రేక్షకులకు తగ్గట్టుగా ఎమోషన్‌తోపాటు కామెడీని కూడా మిక్స్ చేసి చూపిస్తున్నట్టు సంజోష్ వివరించాడు.