పంజాబ్ కింగ్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన ఆర్సీబీ బౌలర్లు
- ఐపీఎల్ లో ఇవాళ డబుల్ హెడర్
- తొలి మ్యాచ్ లో ఆర్సీబీ × పంజాబ్ కింగ్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులు చేసిన పంజాబ్
ఛండీగఢ్ లో జరుగుతున్న ఈ పోరులో బెంగళూరు టీమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులే చేసింది. ప్రియాన్ష్ ఆర్య 22, ప్రభ్ సిమ్రన్ సింగ్ 33, జోష్ ఇంగ్లిస్ 29, శశాంక్ సింగ్ 31, మార్కో యన్సెన్ 25 పరుగులు చేశారు.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 6 పరుగులకే అవుట్ కాగా, నేహల్ వధేరా (5), మార్కస్ స్టొయినిస్ (1) నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా 2, సుయాష్ శర్మ 2, రొమారియా షెపర్డ్ 1 వికెట్ తీశారు.