ఇప్పటికీ మాజీ భార్య మాట వింటున్నావా?: తమ్ముడ్ని ప్రశ్నించిన సల్మాన్ ఖాన్
- మాజీ భార్య సీమా సజ్దే మాట ఇంకా వింటున్నావా అని నిలదీత
- విడాకుల నిందను సోహైల్ తనపై వేసుకున్నాడని వెల్లడి
- జోధ్‌పూర్ జైలులో తన చేదు అనుభవాలను పంచుకున్న సల్మాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల 'అలయన్స్' అనే స్ట్రీమింగ్ రియాలిటీ షో సెట్స్‌లో సందడి చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ షోకు సంబంధించిన క్లిప్‌లు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో తన సోదరుడు సోహైల్ ఖాన్ మాజీ భార్య ప్రస్తావన వచ్చిన సమయంలో సల్మాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
సోహైల్ మాజీ భార్య సీమా సజ్దే గురించి ప్రస్తావిస్తూ సల్మాన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ షోలో సోహైల్ ఖాన్ పాల్గొనగా, సల్మాన్ అతిథిగా హాజరయ్యారు.
షోలో భాగంగా సోహైల్‌ను ఉద్దేశిస్తూ, "నువ్వు ఇంకా సీమా మాట వింటున్నావా? ఈ విషయం నేను చెప్పకూడదేమో కానీ చెబుతున్నాను" అంటూ సల్మాన్ సీరియస్‌గా ప్రశ్నించడం ఆ వీడియోలో కనిపిస్తోంది. విడాకుల విషయంలో తన తమ్ముడు నిందనంతా తనపైనే వేసుకున్నాడని, కానీ ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి సోహైల్ ఎంతలా ప్రయత్నించాడో, మానసికంగా ఎంత నలిగిపోయాడో తనకు తెలుసని సల్మాన్ పేర్కొన్నారు. దీనికి స్పందనగా సోహైల్ తాను ఆ సమయంలో తీవ్రమైన ఆందోళనకు గురయ్యానంటూ బదులిచ్చారు.