ఎల్2 ఎంపురాన్‌లో వివాదాస్పద సీన్లు... క్షమాపణలు చెప్పిన మోహన్‌లాల్..
- సినిమాలో 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన సీన్లపై విమర్శలు
- ఓ వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా సన్నివేశాలున్నాయని ఆరోపణలు
- వాటిని తొలగించాలని డిమాండ్
- తొలగిస్తామన్న మోహన్‌లాల్
- సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు
ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన మోహన్‌లాల్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపారు. రాజకీయ, సామాజిక అంశాలు కొన్ని ఎంపురాన్ సినిమాలో భాగమయ్యాయని, తనకు ప్రియమైన కొందరిని అవి బాధించాయని పేర్కొన్నారు. ఏ రాజకీయ ఉద్యమాన్ని, భావజాలాన్ని, మతాన్ని తన సినిమాలు కించపరచకుండా చూడటం నటుడిగా తన బాధ్యత అని పేర్కొన్నారు. కాబట్టి తన తరుపున, తన చిత్రబృందం తరపున క్షమాపణలు చెబుతున్నట్టు తెలిపారు. ఆ సన్నివేశాలను తొలగించాలని నిర్ణయించినట్టు వివరించారు. గత నాలుగు దశాబ్దాలుగా మీలో ఒకడిగా ఉంటున్నానని, మీ ప్రేమ, నమ్మకమే తన బలమని అభిమానుల్ని ఉద్దేశించి మోహన్‌లాల్ పోస్టు చేశారు. కాగా, ఈ సినిమాను తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబంతో కలిసి వీక్షించారు.