ఐపీఎల్ చరిత్రలో నికోలస్ పూరన్ అరుదైన రికార్డు!
- నిన్న ఉప్పల్ వేదికగా ఎస్ఆర్‌హెచ్, ఎల్ఎస్‌జీ మ్యాచ్
- ఈ మ్యాచ్‌లో 26 బంతుల్లోనే 70 పరుగులు చేసిన పూరన్
- కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదిన కరేబియన్ స్టార్
- ఐపీఎల్ లో 20 బంతుల్లోపే అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు
ఈ క్రికెటర్ కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదాడు. దీంతో అతడు ఐపీఎల్ చరిత్రలో 20 బంతుల్లోపే అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఇప్పటివరకు పూరన్ ఈ ఫీట్‌ను నాలుగు సార్లు సాధించాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్‌లు చెరో మూడు హాఫ్ సెంచరీలతో సంయుక్తంగా రెండవ స్థానంలో ఉన్నారు. ఇక పూరన్ నిన్నటి మ్యాచ్‌లో ఏకంగా 269.23 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం గమనార్హం.
మిచెల్ మార్ష్‌తో కలిసి ఏకంగా 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇది లక్నో విజయానికి సహాయపడింది. నిన్న చేసిన 70 పరుగులతో పూరన్ ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గానూ నిలిచాడు. అతను ఇప్పటివరకు 145 పరుగులు సాధించగా, మార్ష్ 124 పరుగులతో అతని తర్వాతి స్థానంలో ఉన్నాడు. నిన్నటి మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్‌ను ఎల్ఎస్‌జీ ని 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే.