పాతబస్తీ ఫ్లైఓవర్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య
––
మృతురాలిని పాతబస్తీకి చెందిన తాహనజర్ గా గుర్తించామని పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా, తాహనజర్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. కుటుంబంలో గొడవలేమైనా జరిగాయా లేక మరేదైనా కారణమా అనేది తేల్చేందుకు దర్యాఫ్తు చేస్తున్నట్లు వివరించారు.