చెత్త ఎత్తుతుండగా పేలుడు, కుషాయిగూడలో కార్మికుడు మృతి.. వీడియో ఇదిగో!
––
ప్రాథమిక దర్యాఫ్తులో పేలుడుకు కారణం కెమికల్స్ అని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ కెమికల్స్ అక్కడికి ఎలా వచ్చాయి, ఎవరు వేశారనే కోణంలో దర్యాఫ్తు జరుపుతున్నట్లు వివరించారు. కాగా, ఘటనా స్థలానికి సమీపంలోని ఓ సీసీటీవీ కెమెరాలో ఈ పేలుడుకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.