నాగార్జున డ్యామ్ సమీపంలో అగ్నిప్రమాదం
- ప్రధాన డ్యామ్‌ను ఆనుకొని ఉన్న ఎర్త్ డ్యామ్ దిగువ భాగంలో ఎండుగడ్డికి మంటలు
- అర కిలోమీటరు మేర వ్యాపించిన మంటలు
- మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, డ్యామ్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. దాదాపు అర కిలోమీటరు మేర మంటలు వ్యాపించి గడ్డి కాలిపోయింది. మంటలు వ్యాపించిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే ప్రధాన విద్యుత్ కేంద్రం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంటలు అక్కడకి వ్యాపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.