కోనసీమ బిడ్డకు అరుదైన గౌరవం.. పట్నా హైకోర్టు సీజేగా నియామకం

కోనసీమ బిడ్డకు అరుదైన గౌరవం.. పట్నా హైకోర్టు సీజేగా నియామకం

Justice V Kameswar Rao appointed as Patna High Court Chief Justice
  • పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వి. కామేశ్వరరావు
  • ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించిన బిహార్ గవర్నర్
  • కోనసీమ జిల్లా పొన్నమండ గ్రామానికి చెందిన జస్టిస్ కామేశ్వరరావు
  • గతంలో ఢిల్లీ, కర్ణాటక హైకోర్టుల్లోనూ పనిచేసిన అనుభవం
తెలుగు మూలాలున్న జస్టిస్ వల్లూరి కామేశ్వరరావు పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం పట్నాలోని లోక్ భవన్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో బిహార్ గవర్నర్ సయ్యద్ హస్నైన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరితో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

జస్టిస్ కామేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పొన్నమండ గ్రామానికి చెందినవారు. 1965 ఆగస్టు 7న అమలాపురంలో జన్మించిన ఆయన, తండ్రి వాసుదేవమూర్తి ఉద్యోగరీత్యా ఢిల్లీలో స్థిరపడటంతో అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1990లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆయన, 1991లో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు.

2010లో ఢిల్లీ హైకోర్టు ఆయన్ను సీనియర్ అడ్వకేట్‌గా గుర్తించింది. అనంతరం 2013 ఏప్రిల్ 17న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, 2015 మార్చిలో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత కర్ణాటక హైకోర్టుకు బదిలీపై వెళ్లి, అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగానూ సేవలందించారు. తిరిగి ఢిల్లీ హైకోర్టులో పనిచేసిన ఆయన, తాజాగా పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నత బాధ్యతలు చేపట్టారు.

తమ ప్రాంతానికి చెందిన న్యాయమూర్తి పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించడంపై కోనసీమ జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement
Justice V Kameswar Rao
Patna High Court Chief Justice
Konaseema district
Andhra Pradesh judge
Chief Justice appointment
Bihar Governor swearing in

More Telugu News