స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. బీజేపీ నేత మేనల్లుడి దారుణ హత్య

స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. బీజేపీ నేత మేనల్లుడి దారుణ హత్య

BJP leader nephew brutally murdered over extramarital affair with friend wife
  • హరియాణాలోని రేవారి జిల్లాలో ఘటన
  • బీర్ పార్టీకి పిలిచి ఇనుప రాడ్‌తో దాడి చేసి హత్య
  • ప్రధాన నిందితుడు, అతడి మేనల్లుడిని అరెస్ట్ చేసిన పోలీసులు 
తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో బీజేపీ నాయకుడి మేనల్లుడిని అతడి స్నేహితుడే కిరాతకంగా హత్య చేశాడు. హరియాణాలోని రేవారి జిల్లాలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. సెప్టెంబర్ 7న రేవారి జిల్లాలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీ సమీపంలో జితేంద్ర (40) మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. తలపై బలమైన గాయాలు ఉండటంతో హత్యగా నిర్ధారించిన పోలీసులు, జితేంద్ర మామ, బీజేపీ నేత ఉత్తమ్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తన భార్యతో జితేంద్రకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో అతడి స్నేహితుడు ప్రవీణ్ అలియాస్ పప్లా ఈ హత్యకు పక్కా ప్రణాళిక రచించాడు.  

సెప్టెంబర్ 7న బీర్ పార్టీ పేరుతో జితేంద్రను ప్రవీణ్ బయటకు పిలిచాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగిన తర్వాత, హెచ్‌పీసీఎల్ రిఫైనరీ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ కారు దిగిన జితేంద్రపై వెనుక నుంచి ఇనుప రాడ్‌తో పలుమార్లు దాడి చేసి చంపేశాడు. ఈ సమయంలో ప్రవీణ్ మేనల్లుడు అమన్ చుట్టూ కాపలా కాశాడు. ఈ దాడి మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. జర్తాల్ సమీపంలో ప్రవీణ్, అమన్‌లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ప్రవీణ్ నేరం అంగీకరించాడని, తన భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఏఎస్పీ దీపికా అగర్వాల్ తెలిపారు. మొదట రూ.40 లక్షల అప్పు వివాదం కారణంగా హత్య జరిగిందని ప్రచారం జరిగినా, వివాహేతర సంబంధంపై అనుమానమే ప్రధాన కారణమని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులిద్దరినీ కోర్టు మూడు రోజుల పోలీస్ రిమాండ్‌కు పంపింది. హత్యకు వాడిన ఆయుధం, వాహనం కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
Advertisement
Jitendra
BJP leader nephew murder
Rewari crime news
Praveen alias Papla
Haryana murder case
Extramarital affair motive

More Telugu News