పిఠాపురం పాదగయలో అపశ్రుతి.. పుష్కరిణిలో జారిపడి యువకుడి గల్లంతు
- వినాయక చవితి పర్వదినాన పిఠాపురంలో విషాద ఘటన
- గల్లంతైన యువకుడు సాయి (22)గా గుర్తింపు
- స్నేహితులతో కలిసి దర్శనం కోసం వచ్చిన యువకుడు
స్నేహితులతో కలిసి దైవ దర్శనానికి వెళ్లిన ఓ యువకుడు పుష్కరిణిలో గల్లంతైన విషాద ఘటన కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం పాదగయలో చోటుచేసుకుంది. వినాయక చవితి పండుగ పూట ఈ ప్రమాదం సంభవించడంతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.
వివరాల్లోకి వెళితే, పిఠాపురం మండలం కొత్త కందరాడ గ్రామానికి చెందిన సాయి (22) తన ఇద్దరు స్నేహితులతో కలిసి శనివారం ఉదయం స్వామివారి దర్శనం కోసం పాదగయ క్షేత్రానికి వెళ్లాడు. దర్శనానికి ముందు సంప్రదాయం ప్రకారం పుణ్యస్నానం ఆచరించేందుకు ముగ్గురూ కలిసి పుష్కరిణిలోకి దిగారు.
స్నానం చేస్తున్న క్రమంలో సాయి ప్రమాదవశాత్తూ కాలుజారి నీటిలో పడి గల్లంతయ్యాడు. వెంటనే గమనించిన స్నేహితులు, స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. పండుగ రోజే ఇటువంటి దుర్ఘటన జరగడంతో సాయి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.