గుట్కా నమిలి అసెంబ్లీలో ఉమ్మేసిన ఎమ్మెల్యే... స్వచ్ఛందంగా ముందుకు రావాలన్న యూపీ స్పీకర్

గుట్కా నమిలి అసెంబ్లీలో ఉమ్మేసిన ఎమ్మెల్యే... స్వచ్ఛందంగా ముందుకు రావాలన్న యూపీ స్పీకర్

MLA spits Gutka in Uttar Pradesh assembly hall
 
కొందరు తాము ప్రజాప్రతినిధులమన్న స్పృహ లేకుండా వ్యవహరిస్తుంటారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా ఆ కోవలోకే వస్తాడు. గుట్కా నమిలి అసెంబ్లీ హాల్ లో ఉమ్మేశాడు. యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా అసెంబ్లీకి వెళుతుండగా, ద్వారం వద్ద గుట్కా తిని ఊసినట్టుగా కనిపించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన... భద్రతా సిబ్బందిని ఆరా తీయగా... అది ఓ ఎమ్మెల్యే పని అని వెల్లడైంది. 

దాంతో, సదరు ఎమ్మెల్యే తనంతట తానే ముందుకు వచ్చి గుట్కా ఊసినట్టు అంగీకరించాలని, లేకపోతే ఆ ఎమ్మెల్యే ఎవరన్నది తానే బయటపెడతానని స్పీకర్ హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది.
Advertisement
Gutka in Assembly
Speaker Satish Mahana
Uttar Pradesh

More Telugu News