విద్యుత్ ఛార్జీలను పెంచిన పాపం జగన్ దే: గొట్టిపాటి రవి
- వైసీపీ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారన్న గొట్టిపాటి రవి
- ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు చేస్తున్నారని విమర్శ
- కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచదని వ్యాఖ్య
తమ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచబోదని గొట్టిపాటి తెలిపారు. వైసీపీ సభ్యులు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది వైసీపీనే అని అన్నారు. రైతులకు పగటిపూట విద్యుత్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.