గంజాయి లభ్యం... ఐఐటీ బాబాను అదుపులోకి తీసుకొని, ఆ తర్వాత విడుదల చేసిన పోలీసులు!
- జైపూర్‌లో కొందరు వ్యక్తులతో ఐఐటీ బాబా గొడవ
- విచారణలో భాగంగా ఐఐటీ బాబా వద్ద గంజాయిని గుర్తించిన పోలీసులు
- అనుమతించదగిన పరిమితిలో గంజాయి ఉండటంతో విడుదల చేసిన పోలీసులు
జైపూర్‌లో కొందరు వ్యక్తులతో ఐఐటీ బాబా గొడవకు దిగినట్లు సమాచారం రావడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా ఐఐటీ బాబా వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతనిని అదుపులోకి తీసుకొని, ఆ తర్వాత విడుదల చేసినట్లు వెల్లడించారు.
తాను ఎవరితోనూ తగాదాకు వెళ్లలేదని, తన అనుచరులతో పుట్టినరోజు వేడుకలు జరుపుకొంటున్నానని ఐఐటీ బాబా పోలీసులకు తెలిపారు.
హర్యానాకు చెందిన ఐఐటీ బాబా ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేసినట్లు చెబుతున్నారు. కార్పోరేట్ కంపెనీలో పని చేసిన అతను, ఆ తర్వాత ఉద్యోగం వదిలేశారు. ఈ క్రమంలో ఆధ్యాత్మికం వైపు మరలిన ఐఐటీ బాబా, కుంభమేళాకు రావడంతో పాపులర్ అయ్యారు.