రీల్ కోసం రైలు ప్రయాణికుడికి చెంపదెబ్బ

రీల్ కోసం రైలు ప్రయాణికుడికి చెంపదెబ్బ

Boy slapped train passenger for Reel
 
రీల్స్ కోసం యువత విపరీత చేష్టలకు, ప్రాణాంతక సాహసాలకు పాల్పడుతుండడం తెలిసిందే. రీల్స్ మోజులో కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. 

తాజాగా పాట్నాలో ఓ యూట్యూబర్ రీల్ కోసం వెధవ పని చేశాడు. స్టేషన్ లో రైలు కదులుతుండగా... కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికుడి చెంపపై తన ఫ్రెండ్ తో కొట్టించాడు. దాన్ని వీడియో తీశాడు.

సదరు ప్రయాణికుడు ఈ ఘటనతో దిగ్భ్రాంతి చెందాడు. ఈ విషయాన్ని రైల్వే పోలీసులకు దృష్టికి తీసుకెళ్లడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజి పరిశీలించిన పోలీసులు యూట్యూబర్ రితేష్ కుమార్ ను, అతడి ఫ్రెండ్ ను అరెస్ట్ చేశారు. ఆ యూట్యూబర్ తో క్షమాపణ చెప్పించి వీడియో చిత్రీకరించారు. వ్యూస్ కోసమే ఇలా చేశామంటూ ఆ యూట్యూబర్ వెల్లడించాడు.
Advertisement
Reel
Train Passenger
Youtuber
Patna
Railway Police

More Telugu News