తమిళ భాష పత్తాలేకుండా పోతుంది: సీఎం స్టాలిన్ ఆందోళన
- పుట్టిన రోజు సందర్భంగా పార్టీ శ్రేణులకు స్టాలిన్ బహిరంగ లేఖ
- హిందీని కేంద్రం బలవంతంగా రుద్దాలనుకుంటోందని ఆందోళన
- హిందీ వ్యతిరేకోద్యమం దిశగా ప్రజలను ప్రేరేపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
జాతీయ విద్యా విధానం పేరుతో హిందీ భాషను కేంద్రం మనపై బలవంతంగా రుద్దాలనుకుంటోందని స్టాలిన్ విమర్శించారు. పుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవడం తనకు అలవాటని... కానీ ఈసారి హిందీ వ్యతిరేకోద్యమం దిశగా ప్రజలను ప్రేరేపించాల్సిన అవసరం ఉందని... అందుకే పార్టీ శ్రేణులందరినీ కలుసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. మనం అప్రమత్తంగా లేకపోతే రాష్ట్రంలో హిందీ భాష రాజ్యమేలుతుందని, తమిళ భాష పత్తాలేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మాట్లాడుతూ, త్రిభాషా విద్యా విధానం అత్యంత అవసరమని చెప్పారు.