సజ్జల స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడేవాడిని: పోసాని రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
- పవన్ కల్యాణ్, లోకేశ్ కుటుంబ సభ్యులను దూషించినట్లు వాంగ్మూలం!
- పవన్ కల్యాణ్ అభిమానులను రెచ్చగొట్టే ఉద్దేశంతో మాట్లాడినట్లు అంగీకారం!
- పోసాని చెప్పిన అంశాలతో రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించిన పోలీసులు
పవన్ కల్యాణ్, లోకేశ్ కుటుంబ సభ్యులను దూషించానని, తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని చెప్పినట్లుగా సమాచారం. సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ మేరకు తాను విమర్శలు చేశానని, జనసేనాని అభిమానులను రెచ్చగొట్టే ఉద్దేశంతో మాట్లాడినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పినట్లుగా తెలుస్తోంది.
తాను మాట్లాడిన అంశాలకు సంబంధించిన వీడియోలను సజ్జల తనయుడు భార్గవరెడ్డి సామాజిక మాధ్యమంలో వైరల్ చేసేవాడని చెప్పారని తెలుస్తోంది. పోసాని కృష్ణమురళి చెప్పిన అంశాలతో రిమాండ్ రిపోర్టును పోలీసులు రైల్వేకోడూరు కోర్టుకు సమర్పించారు.