రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలి: బండి సంజయ్
- ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
- ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలన్న బీజేపీ నేత బండి సంజయ్
- పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన వైనం
- కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసిందని వెల్లడి
అయితే చాలా కళాశాలలు, పాఠశాలల్లో ఓటు హక్కు కలిగిన సిబ్బందికి కొన్ని గంటల పాటు మాత్రమే అనుమతి నిస్తామని చెబుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు ఓటు హక్కు కలిగిన సిబ్బందికి రోజంతా సెలవును యాజమాన్యాలు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఏడాదిలో అందించే సెలవులకు, వీటికి సంబంధం లేకుండానే అదనంగా పోలింగ్ రోజు సెలవు దినంగా అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.