మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తాం.... వెంటనే అన్నదాత పథకం: సీఎం చంద్రబాబు
- సూపర్-6 హామీల అమలుపై ప్రశ్నిస్తున్న వైసీపీ
- అసెంబ్లీలో నేడు చంద్రబాబు కీలక ప్రకటన
- ఎన్ని ఇబ్బందులున్నా, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని వెల్లడి
"విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు పూర్తిచేస్తాం. తల్లికి వందనం పథకంలో... ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ.15 వేల చొప్పున ఇస్తాం. సాగుకు భరోసా ఇచ్చేలా రైతన్నకు కేంద్రం ఇచ్చే సాయంతో కలిపి మూడు విడతల్లో రూ.20 వేలు అందజేస్తాం. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థికసాయం చేస్తాం" అని చంద్రబాబు వివరించారు.