ఇది సహస్రాబ్ది సినిమా.. 'రామాయణ'కి ఆస్కార్ రావాలి: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్

Devendra Fadnavis calls Ramayana film of the millennium and says it deserves Oscar
  • 'రామాయణ' చిత్రానికి ఆస్కార్ రావాలని ఆకాంక్షించిన మహారాష్ట్ర సీఎం 
  • ఈ చిత్రాన్ని 'ఫిల్మ్ ఆఫ్ ది మిలీనియం'గా అభివర్ణించిన ముఖ్య‌మంత్రి
  • ముంబైలో ప్రైమ్ ఫోకస్ స్టూడియో ప్రారంభోత్సవంలో ఫడ్నవిస్ ఈ వ్యాఖ్యలు 
  • రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న మూవీ
  • ఈ ఏడాది నవంబర్ 6న దీపావళికి సినిమా ఫ‌స్ట్ పార్ట్‌ విడుదల
నితేశ్‌ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణ' చిత్రంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రానికి అకాడమీ అవార్డు (ఆస్కార్) రాకపోతే తాను తీవ్ర నిరాశకు గురవుతానని ఆయన అన్నారు. "ఇది దశాబ్దానికి ఒకసారి వచ్చే సినిమా కాదు, సహస్రాబ్దానికి ఒకసారి వచ్చే సినిమా (ఫిల్మ్ ఆఫ్ ది మిలీనియం)" అంటూ ఆయన ప్రశంసలు కురిపించారు.

ఆగస్టు 6న ముంబైలో నిర్మాత నమిత్ మల్హోత్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రైమ్ ఫోకస్ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫడ్నవిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆధునిక సాంకేతికతతో మన కథలను యువతరానికి చేరవేసే ప్రయత్నంగా ఆయన గతంలోనే అభినందించారు.

నితేశ్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. 'రామాయణ' మొదటి భాగాన్ని 2026 నవంబర్ 6న, దీపావళి పండుగకు రెండు రోజుల ముందు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సోనీ పిక్చర్స్ వెల్ల‌డించింది. ఇక రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Advertisement
Devendra Fadnavis
Ramayana Movie
Nitesh Tiwari
Ranbir Kapoor
Namit Malhotra
Ramayana Oscar

More Telugu News