చీకట్లోనే సమావేశం.. కలిసింది ఖమేనీనేనా?.. ఇరాన్ అధ్యక్షుడికి అనుమానం!
- చీకట్లో ఖమేనీతో రహస్య భేటీ జరిగిందంటూ కథనం
- కలిసింది నిజంగా ఖమేనీనేనా అని పెజెష్కియన్ అనుమానం
- చేతులు కలిపేందుకు కూడా అనుమతించని భద్రతా సిబ్బంది
- రెండోసారి భేటీ అభ్యర్థనకు నిరాకరణ
- ఖమేనీని కలవడం ప్రస్తుతం కష్టమని అధ్యక్షుడి వ్యాఖ్య
- ఇరాన్ ఇంటర్నేషనల్ కథనంతో కొత్త చర్చ
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, దేశ అత్యున్నత నేత మొజ్తబా ఖమేనీ మధ్య జరిగిన రహస్య సమావేశంపై ఆసక్తికర కథనం వెలుగులోకి వచ్చింది. ఇద్దరి భేటీ పూర్తిగా చీకట్లో జరగడంతో తాను మాట్లాడింది నిజంగా ఖమేనీతోనేనా అనే అనుమానం అధ్యక్షుడికి కలిగినట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది.
కథనం ప్రకారం.. పెజెష్కియన్‌ను భద్రతా సిబ్బంది టెహ్రాన్‌లోని ఓ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన్ను మరో కారు ఎక్కించారు. అద్దాలకు నలుపు ఫిల్మ్ ఉన్న ఆ కారులో ఖమేనీ ఉన్నట్లు చెప్పారు. అయితే అక్కడ పూర్తిగా చీకటిగా ఉండటంతో ఇద్దరూ ఒకరినొకరు చూడలేకపోయారు. కొన్ని నిమిషాల పాటు మాత్రమే సంభాషణ జరిగింది. చేతులు కలిపేందుకు కూడా భద్రతా సిబ్బంది అనుమతించలేదని పేర్కొంది.
సమావేశం ముగిసిన తర్వాత తాను మాట్లాడింది నిజంగా ఖమేనీతోనేనా అని పెజెష్కియన్ తన సన్నిహితులను ప్రశ్నించినట్లు నివేదిక తెలిపింది. అనంతరం ఖమేనీ నివాసంలో మరోసారి భేటీ కావాలని కోరినా, ఆ విజ్ఞప్తి తిరస్కరణకు గురైనట్లు పేర్కొంది.
అయితే మే నెలలో వ్యాపార సంఘాల ప్రతినిధులతో మాట్లాడిన పెజెష్కియన్ మాత్రం భిన్నంగా స్పందించారు. ఖమేనీతో దాదాపు రెండున్నర గంటల పాటు సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని అప్పట్లో చెప్పారు.
మరోవైపు ఖమేనీని కలవడం ప్రస్తుతం చాలా కష్టంగా మారిందని పెజెష్కియన్ ఇటీవల వ్యాఖ్యానించారు. అయినా దేశానికి ఆయన నాయకత్వం ఎంతో బలాన్ని ఇస్తోందని చెప్పారు. కొందరు కావాలనే ఖమేనీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా పేర్కొన్నారు.
విధానపరమైన విభేదాల కారణంగా పెజెష్కియన్ పలుసార్లు రాజీనామా చేస్తానని హెచ్చరించినట్లు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఖమేనీ ఆయనకు తుది హెచ్చరిక జారీ చేసినట్లు ఇజ్రాయెల్ మీడియా గతంలో వెల్లడించింది.
ఫిబ్రవరి 2026లో అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత మొజ్తబా ఖమేనీ అత్యున్నత నేతగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించలేదు. లిఖితపూర్వక ప్రకటనలు మాత్రమే విడుదల చేస్తున్నారు.