33 ఏళ్ల లేడీ డాన్.. కోటి రూపాయల హెరాయిన్‌తో పట్టివేత
- జోయా.. లేడీ డాన్ ఆఫ్ ఢిల్లీ అరెస్ట్
- కొంతకాలంగా పోలీసులకు పట్టుబడకుండా ముప్పుతిప్పలు పెడుతున్న జోయా
- గ్యాంగ్ స్టర్ హషీంబాబాకు మూడో భార్య జోయా
తరచూ భర్తను కలిసేందుకు జైలుకు వెళ్లి ముఠాలను నడపడంలో జోయా కిటుకులు పట్టి... మొత్తంగా అతడి నేరసామ్రాజ్యాన్నే భుజానికెత్తుకుంది. హషీం-జోయా ఇద్దరిదీ ఢిల్లీనే. పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు. హషీంకు జోయా మూడో భార్య. ఆమెకూ ఇది రెండో పెళ్లి. జోయా పేరెంట్స్‌కు నేరాలతో సంబంధాలున్నాయి. మహిళల అక్రమరవాణా కేసుకు సంబంధించి గత ఏడాది జోయా తల్లిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు.
నేరసామ్రాజ్యాన్ని నడపడంలో జోయాది విభిన్నశైలి. ఖరీదైన దుస్తులు, జువెలరీ ధరించి... హైప్రొఫైల్ పార్టీలకు హాజరయ్యే ఆమె చుట్టూ ఎప్పుడూ నలుగురు సాయుధులైన అనుచరులుంటారు. దోపిడీలు, డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి ఆమెపై తీవ్ర ఆరోపణలున్నాయి. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్, బిష్ణోయ్ గ్యాంగ్‌తో జోయాకు సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు.