ఓ బండి నెంబర్ ప్లేటు చూసి విస్తుపోయిన విజయవాడ ట్రాఫిక్ పోలీసులు!
ఈ నెంబరు ప్లేటు ఏంది తమ్ముడూ... ఇన్సూర్డ్ బై మాఫియా అని రాసి ఉందేంట్రా. ఇదేం నెంబరు ప్లేటురా.... నేనెప్పుడూ చూడలేదు... కొత్తగా ఉంది ట్రాఫిక్ పోలీసు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మాఫియా ఏందిరా... ఏ మాఫియారా మీరు... అంటూ ప్రశ్నించారు. అంతేకాదు, బైక్ సైలెన్సర్ ను కూడా మోడిఫై చేసి ఉండడం గుర్తించారు.
కాగా, ఆ బైక్ ను ఇటీవలే వేరే వ్యక్తి నుంచి కొనుగోలు చేశానని, అయితే నెంబరు ప్లేటును మార్చకుండా అలాగే ఉంచానని సదరు బైకర్ వెల్లడించాడు. దాంతో, ట్రాఫిక్ పోలీసులు అప్పటికప్పుడు ఆ కుర్రాడ్ని ఇంటికి పంపించి నెంబరు ప్లేటు తెప్పించి, అక్కడే రోడ్డుపైనే బండికి బిగించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.